అర్జున్ విషయంలో ఆధారాలు వున్నాయి .. వెనక్కి తగ్గేది లేదు: శ్రుతి హరిహరన్
- చేసిన ఆరోపణలకు కట్టుబడి వున్నాను
- పరువునష్టం దావా వేస్తే ఎదుర్కుంటాను
- ఎవరి బెదిరింపులకు నేను భయపడను
ఈ నేపథ్యంలో శ్రుతి హరిహరన్ మరోసారి స్పందిస్తూ .. " అర్జున్ పై చేసిన ఆరోపణలకు నేను పూర్తిగా కట్టుబడి వున్నాను. ఆయన నాపై పరువు నష్టం దావా వేస్తే ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా వున్నాను. నా దగ్గర ఆధారాలు వున్నాయి .. బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదు. ఈ విషయంలో నన్ను విమర్శిస్తోన్న వాళ్లకి నేను సాక్ష్యాలు చూపించవలసిన అవసరం లేదు. ఈ వ్యవహారం కోర్టువరకూ వెళితే అక్కడ ఆధారాలు సమర్పిస్తాను" అని చెప్పుకొచ్చారు.