దర్శకుడు సుశీ గణేశన్, అతని భార్య ఫోన్ చేసి నోటికొచ్చినట్టు మాట్లాడారు: అమలాపాల్
- సుశీ గణేశన్ తనను వేధించారన్న లీనా
- లీనా ఆరోపణలను సమర్థిస్తూ అమల పోస్ట్
- వ్యక్తిత్వాన్ని తప్పుబట్టారంటున్న అమల
సుశీ గణేశన్ దర్శకత్వంలో తాను ‘తిరుటుపాయలే 2’ చిత్రంలో నటించానని ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ధైర్యంగా తన సమస్యలను బయటపెట్టిన లీనాను అభినందించింది. ఈ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే అమలాకు సుశీ గణేశన్, మంజరి ఫోన్ చేశారట. తాను చెబుతున్నది వినకుండా, మంజరి నోటికొచ్చినట్టు మాట్లాడారని.. వెటకారంగా నవ్వుతూ తన వ్యక్తిత్వాన్ని తప్పుబట్టారని అమల తెలిపింది. ఇలాంటి వారితో తనను బెదిరించాలనుకుంటున్నారేమో అని అమలాపాల్ ట్వీట్లో పేర్కొంది.