బిగ్‌బాస్ 2లో వీడిన సస్పెన్స్.. ఎంట్రీ ఇచ్చిన ‘స్వామి రారా’ హీరోయిన్!
- హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్
- కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించిన బిగ్ బాస్
- యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న పార్టిసిపెంట్స్
ఆరు వారాల తర్వాత హౌస్ మేట్స్‌కు తొలిసారిగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. ఈ ఫోన్ కార్యక్రమం ఆద్యంతం ఎమోషనల్‌గా సాగింది. తొలుత కౌశల్‌కు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం వచ్చింది. పిల్లలతో మాట్లాడిన అనంతరం ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీరు పెట్టుకున్నాడు. కౌశల్ భార్య మాట్లాడుతూ హౌస్‌లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆ తర్వాత రోల్ రైడా, దీప్తి సునయన, సామ్రాట్ మాట్లాడారు. నేడు మిగతా వారు కుటుంబ సభ్యులతో మాట్లాడనున్నారు. ఫోన్ మాట్లాడిన తర్వాత అందరూ హ్యపీగా గడపడం కనినిపించింది. ముఖ్యంగా కౌశల్ ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది.