ముందుగా 'శభాష్ నాయుడు' .. ఆ తరువాతనే 'భారతీయుడు 2'
- కమల్ హీరోగా 'శభాష్ నాయుడు'
- దర్శక నిర్మాత కూడా ఆయనే
- కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
కమల్ కథానాయకుడిగా .. ఆయనే దర్శక నిర్మాతగా 'శభాష్ నాయుడు' సినిమా షూటింగ్ చాలాకాలం క్రితం మొదలైంది. రమ్యకృష్ణ ..శ్రుతిహాసన్ .. బ్రహ్మానందం ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకున్న తరువాత కమల్ ప్రమాదానికి గురై కొన్నాళ్ల పాటు హాస్పిటల్లోనే వున్నారు. అలా అప్పుడు ఆగిపోయిన ఈ సినిమా షూటింగును తిరిగి మొదలుపెడతానని ఆయన అన్నారు. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.