నేను తెలుగు తెరకి రావడానికి కారణం భానుచందర్: సుమన్
- భానుచందర్ తో ఓ తమిళ మూవీ చేశాను
- తెలుగు సినిమాలు చేయమని ఆయనే చెప్పాడు
- 'తరంగిణి'తో తొలి హిట్ పడింది
"నేను .. భానుచందర్ ఓ తమిళ సినిమాలో కలిసి నటించాం. ఆ సినిమాలో నేను హీరో అయితే తాను విలన్. అలా ఆ సినిమా చేస్తున్నప్పుడే మా మధ్య పరిచయం ఏర్పడింది. తెలుగు సినిమాల్లో ట్రై చేయమని అప్పుడే ఆయన నాకు సలహా ఇచ్చాడు. తెలుగులో తప్పకుండా రాణిస్తావని ప్రోత్సహించాడు. అయితే తెలుగు భాష సరిగ్గా రాకపోవడం వలన నేను సందేహించాను. 'అదే వస్తుంది .. దాని గురించి ఆలోచించకు' అంటూ నాకు ధైర్యం చెప్పాడు. అలా తెలుగులోకి వచ్చిన నాకు 'తరంగిణి' సినిమాతో పెద్ద హిట్ వచ్చింది" అని చెప్పుకొచ్చారు.