'మెహబూబా'లో ఛాన్స్ అలా వచ్చింది: నేహా శెట్టి
- ఆకాశ్ పూరీ హీరోగా 'మెహబూబా'
- కథానాయికగా నేహా శెట్టి
- వచ్చేనెల 11వ తేదీన రిలీజ్
''పూరీ జగన్నాథ్ సినిమాతో తెలుగు తెరకి పరిచయం కావడం ఎంతో ఆనందంగా వుంది. ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వచ్చాను. ఆడిషన్స్ తరువాత పూరీ గారు నన్ను ఎంపిక చేశారు. ఆకాశ్ తో కలిసి నటించడం సంతోషంగా వుంది. సెట్లో ఆయన చాలా సరదాగా వుంటాడు. కెమెరా ముందుకు వచ్చాడంటే మాత్రం .. పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాడు. ఆ సమయంలో ఆయన చాలా సీరియస్ గా పాత్రపైనే దృష్టిపెడతాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది.