సినీ పెద్దలంతా దేవుళ్లలా వ్యవహరిస్తారు... నేనేం చెప్పినా నిలబడదు: బీబీసీ ఇంటర్వ్యూలో హీరోయిన్ రాధికా ఆప్టే
- క్యాస్టింగ్ కౌచ్ బహిరంగ రహస్యం
- ప్రాంతీయ భాషల పరిశ్రమల్లో కూడా
- మిగతా రంగాల్లోనూ ఇదే పరిస్థితన్న రాధికా ఆప్టే
తాను ఏ చిత్ర సంస్థకు, లేదా నిర్మాతకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, బాలీవుడ్ సహా ప్రాంతీయ భాషల చిత్ర పరిశ్రమలోనూ క్యాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం బహిరంగ రహస్యమని వ్యాఖ్యానించింది. సినిమా పరిశ్రమతో పాటు మిగతా అన్ని రంగాల్లోనూ ఈ పరిస్థితి ఉందని చెప్పింది. కాగా, సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పుడు తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే.