టైమ్ బాగుండాలనే ఒకే ఒక్క విషయమే అర్థమైంది: నటుడు హర్షవర్ధన్
- సంగీత దర్శకుడిని కావాలనుకున్న
- కొంతమంది సూచనతో నటన వైపుకు వచ్చాను
- అందువలన మంచి గుర్తింపు వచ్చింది
"హీరో అంటే మంచి ఫేస్ .. గుడ్ స్కిన్ .. మంచి ఫిజిక్ వుండాలని అనుకునేవాడిని. అందువలన నేను సర్జరీ కూడా చేయించుకోవాలనుకున్నాను. కానీ ఆ అవసరం లేకుండానే నాకు బుల్లితెరపై మంచి అవకాశాలు .. వాటి ద్వారా పాప్యులారిటీ వచ్చాయి. అప్పుడు నాకు అర్థమైంది .. హైటు ఆరు అడుగులు ఉండాల్సిన అవసరం లేదు. మంచి స్కిన్ .. ఫిజిక్ .. ఇవేవీ కొలమానాలు కాదు. టైమ్ బాగుండాలి .. అప్పుడు ఆటోమేటిగ్గా అన్నీ జరిగిపోతాయి" అని చెప్పుకొచ్చారు.