నిర్మాతగా కూడా నాని ప్లానింగ్ అదుర్స్ అట!
- హీరోగా వరుస విజయాలు
- 'అ!' సినిమాకి నిర్మాతగా
- లాభాలు రావొచ్చనే అంచనా
హీరోగానే కాదు .. నిర్మాతగాను నాని అంతే ప్లానింగ్ తో వ్యవహరించాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. పరిమితమైన పాత్రలు గల కథను ఎంచుకుని, కాల్షీట్ల లెక్కన పారితోషికం మాట్లాడాడట. అలా ప్రమోషన్స్ తో కలుపుకుని, ఏడెనిమిది కోట్లలోపే సినిమాను సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. ఓవర్సీస్ తో పాటు డిజిటల్ .. శాటిలైట్ రైట్స్ కలుపుకుని అయిదారు కోట్ల వరకూ రావొచ్చని చెబుతున్నారు. ఇక లోకల్ మార్కెట్ లో ఈ సినిమా ఎంత లేదన్నా 6 కోట్లకు తక్కువ పలకదనేది ట్రేడ్ వర్గాల అంచనా. విడుదలకి ముందే నానికి లాభాలు రావడం ఖాయమనేది వాళ్లు చెబుతోన్న మాట.