'ఒక్క క్షణం'లో కామెడీ అందుకే తగ్గింది: అల్లు శిరీష్
- అసలు కథ నిడివి ఎక్కువగా వుంది
- అందుకే కామెడీ సీన్స్ లో కొన్ని లేపేయవలసి వచ్చింది
- ఫోక్ సాంగ్ ను కూడా అందుకే ఉంచలేదు
ఈ విషయంపై అల్లు శిరీష్ స్పందిస్తూ .. "ముందుగా ఈ సినిమా కోసం చాలా కామెడీ సీన్స్ అనుకున్నాం. ఆడియన్స్ ను ఆకట్టుకునే స్థాయిలో వాటిని చిత్రీకరించడం కూడా జరిగిపోయింది. అయితే అసలు కథకి సంబంధించిన నిడివి పెరిగిపోవడం వలన, కామెడీ సీన్స్ ను తగ్గించడం జరిగింది. ఈ సినిమా కోసం అద్భుతంగా చిత్రీకరించిన ఒక ఫోక్ సాంగ్ ను కూడా, అప్పటికే నిడివి ఎక్కువపోయిందనే ఉద్దేశంతో లేపేశాము. రోలింగ్ టైటిల్స్ తరువాత వచ్చేది ఆ సాంగే" అని చెప్పుకొచ్చాడు.