అల్లరి నరేష్ .. సునీల్ తో 'సుడిగాడు 2' .. స్టార్ హీరోయిన్స్ తో సంప్రదింపులు!
- 'సుడిగాడు' సీక్వెల్ కి సన్నాహాలు
- అల్లరి నరేశ్ తో పాటు సునీల్
- రకుల్, లావణ్య త్రిపాఠిలతో సంప్రదింపులు
కథ ప్రకారం ఆయన అల్లరి నరేశ్ తో పాటు సునీల్ ను కూడా తీసుకోనున్నట్టు చెబుతున్నారు. అల్లరి నరేశ్ మాదిరిగానే కొంతకాలంగా సునీల్ కూడా సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి సరసన స్టార్ హీరోయిన్స్ వుంటే బాగుంటుందనే ఉద్దేశంతో, రకుల్ .. లావణ్య త్రిపాఠిని సంప్రదిస్తున్నారట. వాళ్లు కుదరదంటే అప్పుడు ఇతర హీరోయిన్స్ గురించిన ఆలోచన చేస్తారనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ, స్టార్ హీరోయిన్స్ పెద్ద హీరోల సినిమాలు చేయడానికి మాత్రమే ఓకే చెబుతున్నారని చెప్పిన సంగతి తెలిసిందే.