'రాజుగాడు' వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు!
- రాజ్ తరుణ్ తాజా చిత్రంగా 'రాజుగాడు'
- కథానాయికగా అమైరా దస్తూర్
- సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు
- నేనూ రెడీ అంటోన్న 'రాజుగాడు'
సంజనా రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రాజ్ తరుణ్ జోడీగా అమైరా దస్తూర్ నటించింది. భారీ సినిమాలు సంక్రాంతికి వస్తుండటంతో .. థియేటర్ల సమస్య తలెత్తడమే కాదు .. వసూళ్లపై కూడా ప్రభావం పడే ఛాన్స్ వుంది. అందువలన ఈ సినిమా విడుదల విషయంలో వెనక్కి తగ్గవచ్చని అనుకున్నారు. కానీ యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం వలన, వాళ్ల హాలిడేస్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారట. అందువలన ఈ సినిమా సంక్రాంతికే వచ్చే అవకాశాలు వున్నాయనే టాక్ వినిపిస్తోంది.