నేనామెను కొట్టలేదు.. ఆ విషయాన్ని పోలీసులు కూడా తేల్చేశారు: షేన్ వార్న్
- వివాదం సమసిపోయింది
- మీడియాలో వార్తలు చూసి షాక్ తిన్నాను
- నైట్ క్లబ్ లో నేను దాడి చేయలేదు
- పోలీసు విచారణకు పూర్తిగా సహకరించాను
- పోలీసులు సీసీ పుటేజ్ పరిశీలించారు
- స్ధానికులను అడిగి తెలుసుకున్నారు
- తనపై చర్యలు లేవని చెప్పారు
ఆమె కేసు పెట్టడంతో పోలీసులు తనను విచారించారని చెప్పాడు. తాను వారికి పూర్తిగా సహకరించానని తెలిపాడు. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించారని, స్థానికులతో మాట్లాడారని, ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదని గుర్తించారని పేర్కొన్నాడు. తనపై చర్యలు లేవని పోలీసులు చెప్పారని ఆయన తెలిపాడు. పోలీసులు తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఈ వార్తలకు ఇక తెరదించాలని ఆయన మీడియాకు సూచించాడు. కాగా, షేన్ వార్న్ దురుసు ప్రవర్తనతో గతంలో చాలా సార్లు ఇబ్బందులపాలయ్యాడు.