నాని ఇచ్చిన సలహా పాటించాను .. ఇక హిట్ తప్పదు : అల్లరి నరేశ్
ట్రాక్ మార్చమని కొంతకాలంగా తనకి నాని చెబుతూ వస్తున్నాడనీ, ఆయన సలహా మేరకు రూట్ మార్చి చేసిన చిత్రం 'మేడ మీద అబ్బాయి' అని చెప్పాడు. ఈ సినిమా తరువాత రైటర్స్ తనని చూసే యాంగిల్ కూడా మారుతుందనీ, కొత్త కాన్సెప్ట్స్ తో కూడిన కథలతో తన దగ్గరికి దర్శకులు వస్తారనే నమ్మకం ఉందని అన్నాడు. కుటుంబ సమేతంగా చూసేలా ఈ సినిమా తెరకెక్కిందనీ, తాను ఆశిస్తోన్న హిట్ ఈ సినిమాతో దొరుకుతుందని చెప్పుకొచ్చాడు.