నిజమే .. అలా చేయడం దెబ్బకొట్టేసింది!: జగపతిబాబు
ఆ ప్లాప్ ని జగపతిబాబు అంగీకరించారు. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా హారర్ థ్రిల్లర్ అనుకున్నారనీ, తాము ఫ్యామిలీ స్టోరీ చూపించేసరికి నిరాశ చెందారని అన్నారు. బిరియానీ కోసం వచ్చిన వాళ్లకి .. మామూలు భోజనం పెట్టడం వల్లనే పరాజయాన్ని చవి చూడవలసి వచ్చిందని చెప్పారు. మళ్లీ హీరోగా చేయాలా .. వద్దా? అనేది తన దగ్గరికి వచ్చే కథలను బట్టి ఉంటుందని అన్నారు.