'బాహుబలి' సెట్లో తమిళ 'గులేబకావళి'!
దర్శకుడు కల్యాణ్ తమిళంలో 'గులేబకావళి' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రభుదేవా కథానాయకుడిగా, హన్సిక కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో రేవతి కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రాజరికపు నేపథ్యంలో తెరకెక్కించవలసి ఉందట. అందువలన రాజరికపు వస్త్రధారణ, కోటతో కూడిన నగరం అవసరమయ్యాయి. దాంతో ఆ సన్నివేశాలను మాహిష్మతి రాజ్యంలో చిత్రీకరిస్తున్నట్టుగా దర్శక నిర్మాతలు చెబుతున్నారు.