ఇంతవరకూ ఇంతటి గ్లామర్ రోల్ చేయలేదన్న కేథరిన్!
మాస్ ఆడియన్స్ కి నచ్చేలా దర్శకుడు సంపత్ నంది తనని చాలా అందంగా చూపించాడని చెప్పింది. ఈ సినిమాలో తాను చేసిన ఈ గ్లామర్ రోల్, తనకి మరిన్ని ఛాన్సులు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో గోపీచంద్ అందించిన సహాయ సహకారాలను మరిచిపోలేనని చెప్పుకొచ్చింది.