బిగ్ బాస్ షోలో కన్నీళ్లు పెట్టుకున్న సల్మాన్ ఖాన్
- దివంగత నటుడు ధర్మేంద్రను గుర్తుచేసుకుని భావోద్వేగం
- ధర్మేంద్ర పాత వీడియో చూసి బోరున విలపించిన సల్మాన్
- తన పుట్టినరోజు నాడే ఆయన మరణించడం బాధించిందన్న కండల వీరుడు
ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ, "మనం హీమ్యాన్‌ను కోల్పోయాం. ఆయన కంటే గొప్ప నటుడు లేరని నేను భావిస్తున్నా. మిస్ యూ ధర్మేంద్ర జీ. నా పుట్టినరోజు నాడే మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్లడం నన్ను మరింత బాధించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా కనిపించే సల్మాన్ ఖాన్ ఇలా బహిరంగంగా ఏడవడం చూసి ఆయన అభిమానులు ఆశ్చర్యపోయారు. బిగ్ బాస్ షోలో సల్మాన్‌ను సీరియస్‌గానో, సరదాగానో చూశాం కానీ, ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం ఎప్పుడూ చూడలేదని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.