ఇక్కడికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా: ముచ్చింతల్ లో అమిత్ షా
- ముచ్చింతల్ ఆశ్రమానికి విచ్చేసిన అమిత్ షా
- సమతామూర్తి సందర్శన
- సమతామూర్తి భావి తరాలకు స్ఫూర్తిమంత్రం అని వ్యాఖ్య
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా ప్రసంగించారు. శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య సందేశం స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. మనుషులంతా ఒక్కటేనని రామానుజాచార్యులు చాటిచెప్పారని, సమతామూర్తి భావి తరాల వారికి స్ఫూర్తి మంత్రం అని వెల్లడించారు. ఇక్కడికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అమిత్ షా తెలిపారు. సనాతన ధర్మం అన్నింటికి మూలం అని వివరించారు. సమతా మూర్తి విగ్రహ ఏకతా సందేశాన్ని అందిస్తోందని వివరించారు.