కబడ్డీ కోచ్ 'జ్వాలా రెడ్డి'గా తమన్నా ఫస్టులుక్
- గోపీచంద్ కథానాయకుడిగా 'సీటీమార్'
- 'జ్వాలా రెడ్డి' పాత్రలో తమన్నా
- కబడ్డీ నేపథ్యంలో నడిచే కథ
కథానాయికగా .. కబడ్డీ టీమ్ కి కోచ్ గా తమన్నా ఈ సినిమాలో కనిపించనుంది. తాజాగా ఆమె ఫస్టులుక్ పోస్టర్ ను ఈ సినిమా టీమ్ విడుదల చేసింది. 'జ్వాలారెడ్డి'గా తమన్నా పాత్రను పరిచయం చేశారు. 'ఒక ఫైర్ .. కబడ్డీ కోచ్ అయితే ఇలా ఉంటుంది' అంటూ ఈ చిత్ర బృందం ఈ ఫస్టులుక్ ను షేర్ చేసింది. ఇటీవల కాలంలో గోపీచంద్ చేసిన సినిమాలు వరుసగా ఆయనను నిరాశ పరుస్తూ వచ్చాయి. ఈ సినిమాతోనైనా ఆయన విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.