'సీటీమార్' టైటిల్ నే ఖరారు చేసుకున్న గోపీచంద్
- సంపత్ నంది నుంచి 'సీటీమార్'
- కబడ్డీ కోచ్ గా గోపీచంద్
- కథానాయికగా తమన్నా
ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రానికి 'సీటీమార్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే టైటిల్ ను ఖరారు చేస్తూ తాజాగా పోస్టర్ ను వదిలారు. ఈ పోస్టర్లో గోపీచంద్ రఫ్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన కబడ్డీ కోచ్ గా కనిపించనున్నాడు. ఆయన జోడీగా తమన్నా కనిపించనుంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పైనే గోపీచంద్ ఆశలు పెట్టుకున్నాడు. క్యాచీ టైటిల్ తో వస్తున్న గోపీచంద్ ఈ సారైనా హిట్ కొడతాడేమో చూడాలి.