ప్రాంక్ వీడియోల పేరుతో దెయ్యం వేషాలు.. జనాన్ని భయపెడుతున్న యువకుల అరెస్ట్!
- బెంగళూరు శివారులో ప్రాంక్ వీడియోలు
- హడలిపోయిన జనం
- ఏడుగురు యువకుల అరెస్ట్
తెల్లని గౌన్లు ధరించి, రక్తపు మరకలతో రోడ్లపై అకస్మాత్తుగా వీరు ప్రత్యక్షమయ్యేసరికి జనం హడలిపోయారు. కొందరు దీనిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో నిఘా వేసిన పోలీసులు.. యువకులు దెయ్యం వేషధారణలో రోడ్డుపైకి రాగానే అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారు చేసేది ప్రాంక్ వీడియోలే అయినా, చేసే విధానం ప్రమాదకరంగా ఉందని పోలీసులు తెలిపారు.