హైదరాబాద్ వేదికగా బాలు, ఏసుదాస్, చిత్రల 'వాయిస్ ఆఫ్ లెజెండ్స్'
- నవంబర్ 30 వ తేదీన పాటల పండుగ
- తెలుగులో తొలి సంగీత కచేరి
- వేదికగా హైదరాబాద్ - గచ్చిబౌలి స్టేడియం
బాలు తనయుడు చరణ్ ఆధ్వర్యంలో ఈ సంగీత కచేరి జరగనుంది. ఈ విషయాన్ని గురించి బాలూ మాట్లాడుతూ, "గతంలో వేరే కంట్రీస్ లో సంగీత కచేరీలు చేశాము .. తెలుగులో జరుగుతోన్న తొలి సంగీత కచేరి ఇది. ఈ కచేరీలో కేవలం తెలుగు పాటలను మాత్రమే పాడనున్నాము. కర్ణాటక .. తమిళనాడు ప్రాంతానికి చెందిన ప్రొఫెషనల్ మ్యుజిషియన్స్ ఈ లైవ్ షోకు మ్యూజిక్ బ్యాండ్ గా వ్యవహరించనున్నారు. వ్యాపార ధోరిణిలో చేస్తోన్న ఒక అందమైన సాంస్కృతిక కార్యక్రమం ఇది" అని చెప్పుకొచ్చారు.