Hyderabad: నా భార్యను ఓ రౌడీ షీటర్ వేధించేవాడు.. ఆత్మహత్యగా చిత్రీకరించారు: బ్యూటీషియన్ సత్యశిరీష భర్త ఆరోపణలు
- బ్యూటీషియన్ సత్య శిరీష ఆత్మహత్యపై అనుమానాలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త గోపాలకృష్ణ
- హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపణలు
హైదరాబాదు శివారు కేపీహెచ్బీ కాలనీకి చెందిన బ్యూటీషియన్ సత్య శిరీష ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆమె భర్త గోపాలకృష్ణ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన భార్య శిరీషను కొన్ని రోజులుగా స్థానిక రౌడీ షీటర్ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో వాస్తవాలు బయటకు తీయాలని తన ఫిర్యాదులో కోరారు.