సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- చిత్ర నిర్మాణంలోకి అనసూయ!
- రవితేజ సినిమాలో మరో హీరోయిన్
- తమన్నా తాజా బిగ్ డీల్
* రవితేజ కథానాయకుడుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిస్కో రాజా' చిత్రానికి తాజాగా మరో హీరోయిన్ ను ఎంపిక చేశారు. ఇప్పటికే పాయల్ రాజ్ పుత్, నభా నటేశ్ లను నాయికలుగా తీసుకోగా, తాజాగా కన్నడ నటి తాన్యా హోప్ ను మూడవ కథానాయికగా తీసుకున్నారు.
* తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్న కథానాయిక తమన్నా తాజాగా ఓ పెద్ద బ్రాండ్ కు ప్రచారకర్తగా ఎంపికైంది. డాబర్ హనీకి ఆమె బ్రాండ్ అంబాసడార్ గా వ్యవహరిస్తుంది. ఇందుకు సంబంధించిన వాణిజ్య చిత్రాన్ని తాజాగా విడుదల చేశారు.