ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు: శ్రీదేవి కూతురు జాన్వీ
- అమ్మలేదంటే నమ్మబుద్ధి కావడం లేదు
- అర్జున్ భయ్యా వాళ్లు అండగా నిలిచారు
- ఖుషీ కపూర్ కూడా నటన వైపుకే
అమ్మ చనిపోయినప్పుడు నేను .. హర్ష (అనిల్ కపూర్ తనయుడు) మాట్లాడుకుంటూ ఉండగా, అర్జున్ భయ్యా .. అన్షులా దీదీ వచ్చారు. ఆ సమయంలో వాళ్లిద్దరూ మాకు ఎంతో సపోర్ట్ గా నిలిచారు. కుటుంబంలోని వాళ్లమంతా ఒక్కటి కావడం బలాన్ని ఇచ్చింది. అమ్మ దూరమైన తరువాత అర్జున్ భయ్యా వాళ్లు వచ్చి అండగా నిలబడటమే నాకు బాగా గుర్తుండిపోయింది" అని చెప్పుకొచ్చింది. ఇక జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ కూడా నటన పట్ల ఆసక్తిని చూపుతోంది. కరణ్ జొహార్ ఆమెను బాలీవుడ్ తెరకి పరిచయం చేయనున్నట్టు తెలుస్తోంది.