ఉత్కంఠను రేకెత్తిస్తోన్న 'సుబ్రహ్మణ్యపురం' టీజర్
- 'సుబ్రహ్మణ్య పురం' చుట్టూ తిరిగే కథ
- కార్తీక్ పాత్రలో సుమంత్
- త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి
ఇండియన్ టెంపుల్స్ పై హేతుబద్ధంగా రీసెర్చ్ చేసిన కార్తీక్ పాత్రలో సుమంత్ ఈ టీజర్లో కనిపిస్తున్నాడు. నాస్తికుడిగా కనిపించే కార్తీక్ కి ఆ ఊళ్లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆ పరిణామాలను ఆయన ఎలా ఎదుర్కున్నాడు? అనే ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ సినిమా కొనసాగనుంది. 'కార్తికేయ' సినిమా ఛాయలు కనిపిస్తోన్న ఈ సినిమా, సుమంత్ కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.