భారీ చారిత్రక చిత్రంలో జాన్వీ కపూర్ .. బడ్జెట్ 500 కోట్లు
- కరణ్ జొహార్ నిర్మాతగా చారిత్రక చిత్రం
- ప్రధాన హీరోగా రణ్ వీర్ సింగ్.. నాయికలుగా కరీనా, అలియా భట్
- మరో హీరోగా విక్కీ కౌశల్..అతని సరసన జాన్వీ
500 కోట్ల రూపాయల బడ్జెట్ తో కరణ్ జొహార్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన కరీనా కపూర్ .. అలియా భట్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ కూడా ఒక హీరో. ఆయన జోడీగా జాన్వీ కపూర్ ను తీసుకుని ఉండొచ్చునని అనుకుంటున్నారు. కెరియర్ ప్రారంభంలోనే ఇంతటి భారీ చిత్రంలో జాన్వీ కపూర్ కి చోటు లభించడం విశేషమేనని చెప్పాలి.