కేసీఆర్ బయోపిక్ గా 'ఉద్యమ సింహం' .. కేసీఆర్ పాత్రలో నాజర్!
- తెరపైకి కేసీఆర్ బయోపిక్
- టైటిల్ గా 'ఉద్యమ సింహం'
- త్వరలో రెగ్యులర్ షూటింగ్
తాజాగా ఈ సినిమాను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అల్లూరి కృష్ణంరాజు దర్శకుడిగా వ్యవహరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది కనుక, ఈ సినిమాకి 'ఉద్యమ సింహం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కేసీఆర్ పాత్రను నాజర్ పోషించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.