చెప్పులు లేకుండా నడిచిన రోజులున్నాయి: మోహన్ బాబు
- తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడ్డాను
- ఈ రోజున ఈ స్థితిలో వున్నాను
- దర్శకుడికి మంచి భవిష్యత్తు వుంది
తొలి ప్రయత్నంలోనే ఆయనకి సక్సెస్ దక్కాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను కూడా కొత్తే .. తొలినాళ్లలో నేను చెప్పులు లేకుండా తిరిగిన రోజులున్నాయి .. ఎన్నో కష్టాలు పడుతూ ప్లాట్ ఫామ్ నుంచి ఈ స్థితికి వచ్చాను. ఏ రోజున ఏం జరగాలో అదే జరుగుతుంది .. అది భగవంతుడి నిర్ణయం. దర్శకుడు విజయ్ కి మంచి భవిష్యత్తు వుంది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం వుంది" అంటూ లక్ష్మి ప్రసన్నతో పాటు యూనిట్ సభ్యులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.