డిప్రెషన్‌కు ఆహారంతో చెక్ పెట్టొచ్చా?.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
- అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే డిప్రెషన్ లక్షణాల్లో మెరుగుదల
- 20 మందితో యూసీఎస్ఎఫ్ పరిశోధకుల అధ్యయనం
- ఆందోళన లక్షణాల్లోనూ తగ్గినట్లు అధ్యయనంలో గుర్తింపు
- అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ 85 శాతానికి పైగా తగ్గించి అధ్యయనం
- రెండో దశ అధ్యయనం 2028లో ప్రారంభించే యోచనలో పరిశోధకులు
డిప్రెషన్ అంటే కేవలం మనసుకు సంబంధించిన సమస్యేనా? దీనిపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. జన్యువులు, మెదడులో రసాయన మార్పులు, ఒత్తిడి, గత అనుభవాలు వంటి ఎన్నో అంశాలు డిప్రెషన్‌కు కారణం కావచ్చు. ఇప్పుడు ఆహారం కూడా ఇందులో పాత్ర పోషిస్తుందా? అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన ఓ చిన్న అధ్యయనం.. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌ను తగ్గిస్తే డిప్రెషన్ లక్షణాల్లో మార్పు కనిపించొచ్చని సూచించింది.
చిన్న అధ్యయనం.. ఆసక్తికర ఫలితాలు
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో (UCSF) పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ఇందులో డిప్రెషన్‌తో బాధపడుతున్న 20 మంది పాల్గొన్నారు. ముందుగా నాలుగు వారాలు తమ సాధారణ ఆహారాన్ని తీసుకున్నారు. తర్వాత మరో నాలుగు వారాలు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ చాలా తక్కువగా ఉండే ఆహారం తీసుకున్నారు. రెండు దశల్లో ఎవరు ఏ ఆహారం తీసుకోవాలో క్రమాన్ని మార్చారు.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడాన్ని 85 శాతానికి పైగా తగ్గించిన సమయంలో డిప్రెషన్ లక్షణాల్లో గణనీయమైన మెరుగుదల కనిపించింది. మూడు వేర్వేరు పరీక్షల్లో డిప్రెషన్ స్కోర్లు తగ్గాయి. ఆందోళన లక్షణాల్లోనూ కొంత మెరుగుదల కనిపించింది. అధ్యయనంలో 20 మందిలో 19 మంది పూర్తిగా పాల్గొన్నారు.
ఇంతకీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే?
ప్యాకెట్ స్నాక్స్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, ఫాస్ట్‌ఫుడ్, వెంటనే తినే లేదా వేడి చేసుకుని తినే రెడీ-టు-ఈట్ ఆహారం, కొన్ని ప్యాకేజ్డ్ బేకరీ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ మాంసాహార ఉత్పత్తులు ఈ జాబితాలోకి వస్తాయి. ఫ్లేవర్ ఎన్‌హాన్సర్లు, ప్రిజర్వేటివ్‌లు, ఎమల్సిఫైయర్లు, కృత్రిమ రంగుల వంటి పదార్థాలు ఉండే ఆహారాలు కూడా ఇందులో ఉండొచ్చు. అయితే ప్యాకెట్‌లో ఉన్న ప్రతి ఆహారం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కాదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
మెదడుతో పేగులకు సంబంధమేంటి?
ఆహారం పేగుల్లోని సూక్ష్మజీవులపై ప్రభావం చూపుతుంది. పేగులు, రోగనిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థ మధ్య సంబంధం ఉంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా ఉండే ఆహారం పేగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసి ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ మార్పులు మెదడు పనితీరు, మూడ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే డిప్రెషన్‌కు ఈ ఆహారమే నేరుగా కారణమని నిరూపించే ఆధారం ఇప్పటికీ లేదు.
మందులకు ప్రత్యామ్నాయం కాదు
ఈ అధ్యయనం చాలా చిన్నదే. కేవలం 20 మందితో ఎనిమిది వారాల పాటు జరిగింది. అందుకే ఆహారంలో మార్పుతో డిప్రెషన్ నయం అవుతుందని చెప్పలేం. పెద్ద సంఖ్యలో, ఎక్కువ కాలం చేసే పరిశోధనలు అవసరం. డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్న వారు వైద్యుల సూచన లేకుండా మందులు లేదా థెరపీని ఆపకూడదు. ఆహారంలో మార్పులను మాత్రం సమగ్ర ఆరోగ్య సంరక్షణలో ఓ భాగంగా పరిగణించవచ్చు. యూసీఎస్‌ఎఫ్ పరిశోధకులు ఈ అంశంపై రెండో దశ అధ్యయనాన్ని 2028లో ప్రారంభించాలని భావిస్తున్నారు.