933 ఎకరాలు ఉన్నట్లు నిరూపిస్తే రాసిస్తాం.. రేవంత్‌కు కేటీఆర్ ఛాలెంజ్
- సిట్టింగ్ జడ్జితో విచారణకు కేటీఆర్ సవాల్
- కేసీఆర్ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్
- 67 ఎకరాల భూమిపై కేటీఆర్ వివరణ
- 933 ఎకరాలు ఉన్నట్లు నిరూపిస్తే రాసిస్తామని ప్రకటన
- రేవంత్ ఆస్తులపైనా కేటీఆర్ ప్రశ్నలు
మాజీ సీఎం కేసీఆర్ ఆస్తులపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అన్నారు.
గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అసెంబ్లీలో కేసీఆర్ కుటుంబ సభ్యుల భూములపై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉందంటూ ఇన్నాళ్లూ ప్రచారం చేసి.. అసెంబ్లీలో మాత్రం 67 ఎకరాలు ఉన్నట్లు సీఎం చెప్పారని కేటీఆర్ అన్నారు. తప్పుడు ప్రచారం చేసినందుకు రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్‌కు 933 ఎకరాల భూమి ఉందని ప్రభుత్వం నిరూపిస్తే ఆ భూములను రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులపై పుట్టుపూర్వోత్తరాలతో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
కేసీఆర్ భూస్వామ్య కుటుంబంలో పుట్టారని, తమ తాతకు వందల ఎకరాల భూమి ఉండేదని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు 67 ఎకరాలు ఉండటం తప్పా? అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో రేవంత్‌రెడ్డి ఆస్తులపైనా కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. తాను అమెరికాలో ఉద్యోగం చేసి సంపాదించుకున్నానని చెబుతున్నా.. రేవంత్‌రెడ్డికి జూబ్లీహిల్స్‌లో ప్యాలెస్ లాంటి ఇల్లు, ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆయన తమ్ముళ్లు ఏరోస్పేస్ కంపెనీలు ఎలా ఏర్పాటు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం అయ్యాక ఆయన చిన్నాన్న ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో వివరించాలని కోరారు.
రేవంత్‌రెడ్డి తమ పార్టీ నేతలపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రతి పథకంలోనూ స్కామ్ ఉంటోందని ఆరోపించారు.