ఇంట్లోనే ఉండి ఉద్యోగం.. అయినా ఎందుకీ ఒంటరితనం? రిమోట్ వర్క్‌పై తాజా అధ్యయనం ఏం చెబుతోందంటే..!
- రిమోట్ వర్క్‌తో పెరిగిన ఒంటరిగా గడిపే సమయం
- మానసిక ఆరోగ్యంపై కనిపించిన ప్రతికూల ప్రభావం
- ఒంటరిగా జీవించేవారిపై ఎక్కువ ప్రభావం
- 5,88,322 మంది ఉద్యోగుల సమాచారంపై అధ్యయనం
- రిమోట్ వర్క్ వల్ల మానసిక ఒత్తిడి పెరిగినట్లు గుర్తింపు
ఉదయం ల్యాప్‌టాప్ తెరుస్తాం.. పని మొదలుపెడతాం. మధ్యలో కాఫీ కోసం లేచినా పలకరించే సహోద్యోగి ఉండడు. మీటింగ్‌కు ముందు రెండు మాటలు మాట్లాడేవారు కనిపించరు. సాయంత్రం పని ముగిసినా అదే గది. రోజంతా మనుషుల మధ్య ఉన్నట్టే అనిపించినా.. నిజానికి మనతో ఉన్నది స్క్రీన్ మాత్రమే. ఇదే ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల్లో కనిపించని ఒంటరితనానికి కారణమవుతోందా?
పెరుగుతున్న ఒంటరితనం
‘సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఈ ప్రశ్నకు ఆందోళన కలిగించే సమాధానం చెబుతోంది. కరోనా తర్వాత ఇంటి నుంచి పనిచేయడం పెరగడంతో ఉద్యోగులు ఒంటరిగా గడిపే సమయం పెరిగిందని పరిశోధకులు గుర్తించారు. దీనితో మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం కనిపించిందని తెలిపారు.
నటాలియా ఇమాన్యుయేల్, ఎమ్మా హారింగ్టన్, అమాండా పల్లైస్ నేతృత్వంలోని పరిశోధక బృందం 2011-2024 మధ్య 5 సర్వేల్లో పాల్గొన్న 5,88,322 మంది అమెరికా ఉద్యోగుల సమాచారాన్ని పరిశీలించింది. కరోనా తీవ్రంగా ఉన్న 2020, 2021 సంవత్సరాలను అధ్యయనంలో చేర్చలేదు.
ఒంటరిగా ఉండేవారిపై ఎక్కువ ప్రభావం
ఇంటి నుంచి పనిచేయడం అందరినీ ఒంటరిగా మార్చదు. కుటుంబంతో ఉండేవారికి ఇంట్లోనే సామాజిక సంబంధాలు కొనసాగుతాయి. కానీ ఒంటరిగా జీవించే వారికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది.
ఆఫీసు వారికి రోజువారీ మానవ సంబంధాలకు ముఖ్యమైన వేదికగా ఉంటుంది. డెస్క్ దగ్గర చిన్న మాట, కాఫీ దగ్గర పలకరింపు, మీటింగ్ ముందు సరదా సంభాషణ.. ఇవన్నీ చిన్నవిగానే కనిపిస్తాయి. కానీ అవే, రోజులో మనుషులతో కలిసే అవకాశాలను పెంచుతాయి. ఇంటి నుంచి పని చేయడం వల్ల ఈ పరిచయాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి.
మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం
2022-2024 కాలాన్ని 2011-2019తో పోల్చినప్పుడు పెరిగిన ఒంటరితనం, మానసిక ఒత్తిడిలో దాదాపు మూడో వంతు పెరుగుదలకు రిమోట్ వర్క్ కారణమై ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు. మానసిక ఆరోగ్య సేవలు తీసుకోవడం, సంబంధిత మందుల వినియోగం కూడా పెరిగినట్లు గుర్తించారు.
అయితే ఇంటి నుంచి పనిచేయడమే డిప్రెషన్‌కు కారణమని ఈ అధ్యయనం చెప్పడం లేదు. అలాగే రిమోట్ వర్క్ వల్ల అందరికీ ఇలాంటి సమస్యలు వస్తాయని కూడా కాదు.
పరిష్కారం ఆఫీసుకు వెళ్లడమేనా?
ఇంటి నుంచి పనిచేయడం వల్ల ప్రయాణ సమయం తగ్గుతుంది. పని విషయంలో వెసులుబాటు పెరుగుతుంది. కుటుంబ బాధ్యతలను చూసుకోవడం సులభమవుతుంది. ఇవన్నీ ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడే అంశాలే.
అందుకే వారంలో ఐదు రోజులు ఆఫీసుకు రావాలన్నదే పరిష్కారం కాకపోవచ్చు. రిమోట్ వర్క్ కొనసాగిస్తూనే మనుషులతో కలిసే అవకాశాలను ఎలా పెంచుకోవాలన్నదే అసలు ప్రశ్న.
ఎందుకంటే రోజులో మనకు పెద్దగా గుర్తుండని ఆ ఐదు నిమిషాల మాటే.. కొన్నిసార్లు రోజంతా ఒంటరితనాన్ని దూరం చేసే చిన్న కారణం కావచ్చు.