కుటుంబంతో కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్.. ఫొటోలు ఇవిగో!

కుటుంబంతో కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్.. ఫొటోలు ఇవిగో!

Nara Lokesh attends Tirumala Srivari Brahmotsavam with family see photos
  • ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
  • శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు, లోకేశ్, భువనేశ్వరి, నారా బ్రహ్మణి
  • పెద్దశేష వాహన సేవలో పాల్గొన్న చంద్రబాబు, లోకేశ్
  • 2027 టీటీడీ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సీఎం
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల తొలిరోజున రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం తెలిసిందే. ఈ పవిత్ర వేడుకలలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు.

మంగళవారం సాయంత్రం తిరుమల చేరుకున్న మంత్రి లోకేశ్, ఆయన కుటుంబ సభ్యులు తొలుత బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకోగా, అధికారులు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అర్ధాంగి భువనేశ్వరి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలను అందజేశారు.

అనంతరం సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, మంత్రి లోకేశ్, నారా బ్రహ్మణి స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 2027 సంవత్సరానికి సంబంధించిన టీటీడీ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల జరిగిన పెద్దశేష వాహనసేవలో పాల్గొని మలయప్ప స్వామిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, ఇతర ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Advertisement
Nara Lokesh
Tirumala Brahmotsavam
Chandrababu Naidu
TTD Calendar 2027
Tirupati Srivari Temple
Nara Brahmani

More Telugu News