ఇరాన్‌తో పోరు: అమెరికాకు అపార నష్టం.. తొలిసారిగా లెక్కల విడుదల

ఇరాన్‌తో పోరు: అమెరికాకు అపార నష్టం.. తొలిసారిగా లెక్కల విడుదల

United States faces massive losses in Iran conflict report released for the first time
  • ఇరాన్‌తో యుద్ధ నష్టంపై తొలి అధికారిక నివేదికను విడుదల చేసిన అమెరికా
  • జూన్ 30 నాటికి 33.4 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్టు వెల్లడి
  • డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు, వందలాది భవనాలు ధ్వంసమైనట్టు నిర్ధారణ
  • అత్యాధునిక ఆయుధాల నిల్వల్లో తీవ్ర కొరత ఏర్పడిందన్న నివేదిక
ఇరాన్‌తో యుద్ధం వల్ల అమెరికాకు జరిగిన నష్టంపై అమెరికా ప్రభుత్వ వాచ్‌డాగ్ తొలిసారిగా అధికారిక నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధంలో అమెరికా కోల్పోయిన పరికరాలు, ధ్వంసమైన సైనిక స్థావరాలు, దౌత్యపరమైన ఖర్చులు, ఆయుధాల కొరత వంటి వివరాలను ఈ నివేదికలో సమగ్రంగా పొందుపరిచారు. జూన్ 30 వరకు జరిగిన నష్టాన్ని పెంటింగ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఈ రిపోర్ట్‌లో లెక్కగట్టారు.

ఈ నివేదిక ప్రకారం కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, ఒమన్, జోర్డాన్‌లలోని అమెరికా సైనిక స్థావరాల్లో వందలాది భవనాలు ఇరాన్ దాడుల్లో ధ్వంసమయ్యాయి లేదా దెబ్బతిన్నాయి. వీటితో పాటు నాలుగు F-15E ఫైటర్లు, ఒక F-35A, ఒక A-10, పన్నెండు KC-135 ఇంధన రీఫ్యూయలింగ్ విమానాలు, 30కి పైగా MQ-9 డ్రోన్లు సహా డజన్ల కొద్దీ విమానాలు నాశనమయ్యాయి.

జూన్ 30 నాటికి రక్షణ శాఖకు సుమారు 33.4 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు. ఇందులో వినియోగించిన ఆయుధాల విలువ 22.3 బిలియన్ డాలర్లు కాగా, ధ్వంసమైన పరికరాల నష్టం 3.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే, జులై చివరి నాటికి మొత్తం యుద్ధ వ్యయం 37.5 బిలియన్ డాలర్లకు చేరిందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ గతంలో కాంగ్రెస్‌కు తెలిపారు. దౌత్య కార్యాలయాలపై జరిగిన 600లకు పైగా దాడుల వల్ల 184 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది.

ఈ యుద్ధం వల్ల అమెరికా ఆయుధాగారాల్లో వ్యూహాత్మక కొరత ఏర్పడిందని, అత్యాధునిక క్షిపణుల నిల్వలను తిరిగి యుద్ధానికి ముందున్న స్థాయికి చేర్చడానికి సుమారు మూడేళ్లు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నట్టు నివేదిక స్పష్టం చేసింది. యుద్ధ నష్టంపై స్వతంత్ర సంస్థల అంచనాలు ఇంకా ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం విడుదల చేసిన అత్యంత పూర్తిస్థాయి నివేదిక ఇదే.
Advertisement
United States
Iran war losses
Pentagon Inspector General report
US military equipment damage
F-35 and MQ-9 drone losses
US defense expenditure

More Telugu News