షమీ వయసుపై చర్చ.. కోహ్లీ, రోహిత్‌లను చూపిస్తూ చోప్రా కౌంటర్
- టీమిండియాలో షమీ ఎంపికపై స్పందించిన మాజీ క్రికెటర్
- వయసు కారణంగా షమీని పక్కనపెట్టారన్న వాదన పూర్తిగా అసంబద్ధమన్న చోప్రా
- కోహ్లీ, రోహిత్‌లు ఆడుతున్నప్పుడు వయసు ఎలా కారణమవుతుందని ప్రశ్న
- ఫిట్‌గా లేకపోవడమే సమస్య తప్ప, వయసు కాదని పరోక్షంగా వ్యాఖ్య
భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని వయసు కారణంగానే జట్టులోకి తీసుకోవడం లేదనే వాదనలను మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తోసిపుచ్చాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు ఇంకా జట్టులో కొనసాగుతున్నప్పుడు, ఒక్క షమీ విషయంలోనే వయసును కారణంగా చూపడం సరికాదని స్పష్టం చేశాడు.
36 ఏళ్ల షమీ గత ఏడాదిన్నరగా పదేపదే గాయాల బారిన పడుతూ జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ యువ బౌలర్ల వైపు మొగ్గుచూపుతోంది. దీంతో షమీ కెరీర్ వయసు కారణంగానే ముగింపు దశకు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.
ఈ వాదనలపై తాజాగా స్పందించిన ఆకాశ్ చోప్రా "షమీకి వయసు ప్రతికూలంగా మారిందా? అది పూర్తిగా అసంబద్ధం. జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి అనుభవజ్ఞులను ఎంపిక చేస్తున్నప్పుడు, వయసు కారణంగా ఒకరిని తొలగించడంలో అర్థం లేదు. నా అంచనా ప్రకారం, షమీ ఎంపికలో వయసు అస్సలు కారణం కాదు. సెలక్టర్లు ఏదో ఒక రోజు కారణం చెబుతారు, కానీ అది మాత్రం వయసు అయి ఉండదు" అని ఒక వీడియోలో స్పష్టం చేశాడు.
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌తో షమీని పోల్చుతూ చోప్రా మరిన్ని విషయాలు వివరించాడు. "స్టార్క్ పూర్తి ఫిట్‌గా ఉంటూ నిరంతరం ఆడుతున్నాడు. జట్టులోకి వచ్చిన ప్రతీసారి బౌలింగ్ దాడిని ముందుండి నడిపించాడు. అతడి ఫామ్, ఫిట్‌నెస్, పదునుపై ఎలాంటి సందేహాలు లేవు" అని అన్నాడు. షమీ విషయంలో గాయాలు, ఫిట్‌నెస్ ప్రధాన సమస్యగా ఉన్నాయని పరోక్షంగా సూచించాడు.
షమీ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టుకు ఆడాడు. ఆ తర్వాత వరుస గాయాలతో బాధపడుతూ జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు.