ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురి దుర్మరణం

ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురి దుర్మరణం

Vizianagaram road accident three killed as lorry hits auto rickshaw
  • విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం షికారుగంటి జంక్షన్ వద్ద ఘటన 
  • ఆటోను ఎదురుగా వచ్చి ఢీకొట్టిన లారీ
  • మృతులు బాడంగి మండలం వాసులుగా గుర్తింపు
విజయనగరం జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దత్తిరాజేరు మండలం షికారుగంటి జంక్షన్ వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  

పోలీసుల కథనం ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతులను బాడంగి మండలం గజరాయనివలస గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 
Advertisement
Vizianagaram
Road accident
Lorry hits auto
Three killed in accident
Dattirajeru mandal
Andhra Pradesh news

More Telugu News