బిగ్‌బాస్ 20: స్టార్స్ ఎంతమంది ఉన్నా.. రాక్‌స్టార్ అతడొక్కడే: సల్మాన్ ఖాన్

బిగ్‌బాస్ 20: స్టార్స్ ఎంతమంది ఉన్నా.. రాక్‌స్టార్ అతడొక్కడే: సల్మాన్ ఖాన్

  • బిగ్‌బాస్ 20లో ఖాజీ తౌకీర్‌పై సల్మాన్ ఖాన్ ప్రశంసలు
  • హౌస్‌లో రాక్‌స్టార్ ఒక్కడేనంటూ ఖాజీకి కితాబిచ్చిన సల్మాన్
  • ఖాజీ సిగ్నేచర్ స్టెప్‌ను అనుకరించిన సల్మాన్ ఖాన్
  • సల్మాన్ ప్రశంసలతో తొలివారంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఖాజీ
దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా వీక్షించే రియాలిటీ షో 'బిగ్‌బాస్' కొత్త సీజన్ అప్పుడే ఆసక్తిని రేకెత్తిస్తోంది. 'బిగ్‌బాస్ 20' తొలి 'వీకెండ్ కా వార్' ఎపిసోడ్‌లో హోస్ట్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. హౌస్‌లో ఎంతమంది స్టార్లు ఉన్నా, అసలైన రాక్‌స్టార్ మాత్రం ఒక్కడేనని, అతడే గాయకుడు ఖాజీ తౌకీర్ అని సల్మాన్ ప్రశంసించారు.

ఈ వారం మొత్తం ఖాజీ తన సిగ్నేచర్ స్టైల్ "ఓవ్" అంటూ హౌస్‌లో సందడి చేశారని సల్మాన్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఖాజీని సరదాగా అనుకరిస్తూ "ఈ ఇంట్లో ఎంతమంది స్టార్స్ ఉన్నా, రాక్‌స్టార్ మాత్రం ఒక్కడే, అతడే ఖాజీ తౌకీర్. వారం మొత్తం 'ఓవ్' అంటూ తిరిగావు కదా.. 'ఐ యామ్ ఏ రాక్‌స్టార్ బేబీ' అని నాక్కూడా నేర్పించు" అంటూ వ్యాఖ్యానించారు. దీంతో షోలో నవ్వులు పూశాయి.

అనంతరం హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లందరితోనూ ఖాజీ సిగ్నేచర్ స్టెప్‌ను చేయించిన సల్మాన్, ఆ మూవ్ చేయడం తనకు చాలా కష్టంగా ఉందని అంగీకరించారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా షో నిర్వాహకులు ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు. ఖాజీ తన ఎనర్జిటిక్ స్టైల్‌తో తొలివారంలోనే సల్మాన్‌ను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

సెప్టెంబర్ 6న ప్రారంభమైన 'బిగ్‌బాస్ 20' కలర్స్ టీవీ, జియోహాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. ఈ సీజన్‌లో బాక్సర్ మేరీ కోమ్, మహీ విజ్ వంటి ప్రముఖులతో పాటు 'ఫేమ్ గురుకుల్' విజేతగా గుర్తింపు పొందిన ఖాజీ తౌకీర్ కూడా పోటీ పడుతున్న విషయం తెలిసిందే.
Advertisement

More Telugu News