గణేశ్ మంటపాల నిర్వాహకులకు తియ్యని కబురు చెప్పిన మంత్రి నారా లోకేశ్
- వినాయక మండపాలకు ఉచిత విద్యుత్.. ఏపీ ప్రభుత్వ నిర్ణయం
- సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన మంత్రి నారా లోకేశ్
- నిర్వాహకులపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యమన్న ప్రభుత్వం
- కూటమి సర్కార్ నిర్ణయంపై భక్తులు, ఉత్సవ కమిటీల హర్షం
వినాయక చవితి పండుగ సమీపిస్తున్న వేళ, ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఉత్సవ నిర్వాహకులకు, భక్తులకు ఒక శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ప్రతీ గణేశ్ మంటపానికి ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు నారా లోకేశ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా తన ప్రకటనను వెల్లడించారు. విద్యుత్ ఛార్జీల భారం లేకుండా, ఉత్సవ కమిటీలు, భక్తులు మరింత ఉత్సాహంగా, వైభవంగా వేడుకలు జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. "ఈ వినాయక చవితికి, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అన్ని గణేశ్ మంటపాలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని ప్రకటించడం సంతోషంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న వారికి మద్దతుగా, వేడుకలను మరింత వైభవంగా నిర్వహించేందుకు మా ప్రభుత్వం ఈ చొరవ తీసుకుంది" అని లోకేశ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
సాధారణంగా ఇప్పటివరకు ఉత్సవ కమిటీలు గణేశ్ మండపాల కోసం తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు తీసుకోవాలంటే నిర్ణీత రుసుములు చెల్లించాల్సి వచ్చేది. అనుమతుల కోసం కూడా కొంత శ్రమించాల్సి ఉండేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నిర్వాహకులకు ఈ ఆర్థిక భారం, ప్రక్రియపరమైన ఇబ్బందులు తప్పనున్నాయి. ఈ నిర్ణయం పట్ల ఉత్సవ కమిటీల నిర్వాహకులు, భక్తుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రతీ కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, విజయాలతో వర్ధిల్లాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు.