9/11 ఉగ్రదాడి తర్వాత అమెరికా ఆకాశం బంద్.. ఆ ఒక్క ఫ్లైట్ మాత్రం ఎందుకు ఎగిరింది?
- ఉగ్రదాడి తర్వాత కేవలం సైనిక విమానాలకు మాత్రమే అనుమతి
- అదే రోజు 62 ఏళ్ల లారెన్స్ వాన్ సెర్టిమాకు పాము కాటు
- ఆయన్న కాపాడేందుకు అవసరమైన యంటీ వీనమ్
- దాన్ని రవాణా చేసేందుకు ఓ విమానానికి ప్రత్యేక అనుమతి
- సకాలంలో చికిత్స అంది ప్రాణాలతో బయటపడిన సెర్టిమా
2001 సెప్టెంబర్ 11.. అమెరికా చరిత్రలోనే అత్యంత విషాదకరమైన రోజు. ఉగ్రదాడుల తర్వాత దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆకాశంలో సైనిక విమానాలు తప్ప మరే విమానమూ కనిపించని పరిస్థితి. కానీ ఆ నిశ్శబ్ద ఆకాశంలో ఓ చిన్న ఎర్ర కూలర్ మాత్రం ప్రయాణించింది. అందులో బాంబులు లేవు. ఆయుధాలు లేవు. ప్రభుత్వ పరికరాలూ లేవు. ప్రాణాలను కాపాడగల కొన్ని అరుదైన యాంటీవీనమ్ సీసాలు మాత్రమే ఉన్నాయి. అవి కాలిఫోర్నియా నుంచి ఫ్లోరిడాకు చేరాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఓ వ్యక్తి అత్యంత విషపూరితమైన పాము కాటుతో చావుబతుకుల్లో ఉన్నాడు.
ఒక్క కాటుతో ప్రాణాపాయం
62 ఏళ్ల లారెన్స్ వాన్ సెర్టిమా ఎన్నో ఏళ్లుగా పాములను పట్టే పని చేసేవారు. సెప్టెంబర్ 11న ఓ ఇన్‌ల్యాండ్ తైపాన్‌ను తిరిగి దాని బోనులో పెట్టే సమయంలో ఆ పాము ఆయన బొటనవేలిని కరిచింది. ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాముల్లో ఇన్‌ల్యాండ్ తైపాన్ ఒకటి.
భార్య వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ పరిస్థితి వేగంగా విషమించింది. ఆయన స్పృహ కోల్పోయారు. కళ్ల నుంచి, చెవుల నుంచి, నోటి నుంచి రక్తస్రావం మొదలైంది. పాము విషం రక్తం గడ్డకట్టే ప్రక్రియను దెబ్బతీయడంతో పాటు నాడీ వ్యవస్థపైనా ప్రభావం చూపింది.
మియామి-డేడ్ ఫైర్ కెప్టెన్ అల్ క్రూజ్ అక్కడికి చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘వీనమ్ వన్’ విభాగం వల్ల స్థానికంగా యాంటీవీనమ్ అందుబాటులో ఉంది. కానీ అది సరిపోలేదు. ఇన్‌ల్యాండ్ తైపాన్ కాటుకు ప్రత్యేకంగా ఉపయోగించే యాంటీవీనమ్ కావాల్సి వచ్చింది.
కాలిఫోర్నియాలో మందు.. ఫ్లోరిడాలో ప్రాణం
ఆ ప్రత్యేక యాంటీవీనమ్ చాలా తక్కువ మోతాదులో మాత్రమే అందుబాటులో ఉంది. అధికారులు న్యూయార్క్‌లోని బ్రాంక్స్ జూ, కాలిఫోర్నియాలోని శాండియాగో జూలను సంప్రదించారు. 9/11 దాడులతో న్యూయార్క్ పరిస్థితి దారుణంగా ఉండటంతో శాండియాగో నుంచే మందు తెప్పించడం సాధ్యమని భావించారు.
కానీ అప్పటికే అమెరికా ఆకాశం మూగబోయింది. దాడుల తర్వాత ఉదయం 9.45 గంటలకు దేశంలోని అన్ని పౌర విమానాలను సమీప విమానాశ్రయంలో దిగాల్సిందిగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ఆదేశించింది. అమెరికా చరిత్రలో పౌర విమానాల రాకపోకలను దేశవ్యాప్తంగా పూర్తిగా నిలిపివేయడం అదే తొలిసారి.
మధ్యాహ్నానికి సైనిక, వైద్య విమానాలు తప్ప దాదాపు ఆకాశమంతా ఖాళీగా మారింది. ఇలాంటి సమయంలో సాధారణ విమానంలో మందు పంపడం అసాధ్యం. వాన్ సెర్టిమా పరిస్థితి క్షీణిస్తుండటంతో ఆసుపత్రి, అగ్నిమాపక, అత్యవసర సేవల అధికారులు దేశవ్యాప్తంగా ప్రయత్నాలు ప్రారంభించారు.
చివరకు బాప్టిస్ట్ హెల్త్ సౌత్ ఫ్లోరిడా ఎయిర్ అంబులెన్స్ సేవలను పర్యవేక్షించే జానీ డెల్గాడో తనకు పరిచయమైన ఎఫ్‌ఏఏ అధికారిని సంప్రదించారు. అభ్యర్థన అసాధారణమైనది. చావుబతుకుల్లో ఉన్న వ్యక్తి కోసం ప్రత్యేక యాంటీవీనమ్‌ను దేశంలోని మరో ప్రాంతం నుంచి విమానంలో తీసుకురావడానికి అనుమతి కావాలి. ‘‘ఇలా చేయకపోతే ఈ వ్యక్తి చనిపోతాడు’’ అని డెల్గాడో అధికారికి చెప్పినట్లు తరువాత గుర్తుచేసుకున్నారు.
ఎఫ్‌ఏఏ చివరకు విమానానికి అనుమతి ఇచ్చింది. అయితే ఒక షరతు పెట్టింది. విమానం పగటి సమయంలోనే ప్రయాణించాలి.
పాము విషానికి ఆ మందే కీలకం
ఇన్‌ల్యాండ్ తైపాన్ విషంలో రక్తం గడ్డకట్టడం, కండరాలు, నరాలు, కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపే విషపదార్థాలు ఉంటాయి. అందుకే సాధారణ చికిత్సతో సరిపోని పరిస్థితిలో ప్రత్యేక యాంటీవీనమ్ అవసరమైంది. శాండియాగో నుంచి తెచ్చిన ఆ అరుదైన మందు వాన్ సెర్టిమా చికిత్సలో కీలకంగా మారింది.
రెండు రోజుల తర్వాత ఆయన డెల్గాడోతో కలిసి సీబీఎస్ ‘ది ఎర్లీ షో’ కార్యక్రమంలో ఈ ఘటన గురించి మాట్లాడారు. ‘‘పాము తప్పు చేయలేదు. పాము ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించింది’’ అని ఆయన చెప్పారు. జరిగిన తప్పు తనదేనని స్పష్టం చేశారు.
9/11 చరిత్రలో ఈ ఘటన పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ ఆ రోజు అమెరికాలో జరిగిన ఓ అసాధారణ విషయాన్ని ఇది గుర్తుచేస్తుంది. దేశం భారీ ఉగ్రదాడిని ఎదుర్కొన్నా.. ఆకాశంలో విమానాలన్నీ నిలిచిపోయినా.. మనుషుల ప్రాణాలకు సంబంధించిన అత్యవసర పరిస్థితులు మాత్రం ఆగలేదు. ఒక మనిషిని కాపాడేందుకు ఆ రోజు మూగబోయిన అమెరికా ఆకాశంలో ప్రత్యేకంగా ఓ విమానం ఎగిరింది. దాని వెంట వెళ్లింది.. ఓ చిన్న ఎర్ర కూలర్‌లోని కొన్ని యాంటీవీనమ్ సీసాలు.