ఊహకందని మలుపులతో ఉక్కిరిబిక్కిరిచేసే 'అనోమి' .. ఓటీటీలో!

ఊహకందని మలుపులతో ఉక్కిరిబిక్కిరిచేసే 'అనోమి' .. ఓటీటీలో!

Anomie Movie Update
  • మలయాళంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్
  • ప్రధానమైన పాతను పోషించిన భావన
  • పోలీస్ ఆఫీసర్ గా మెప్పించిన రెహ్మాన్ 
  • అక్కాతమ్ముళ్ల ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథ 
  • ఆగస్టు 27 నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్  

మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ఒకటి ఇప్పుడు ఓటీటీలో తన జోరు చూపిస్తోంది. ఆడియన్స్ గెస్ చేయలేని మలుపులతో దూసుకుపోతోంది. అడుగడుగునా ఆసక్తిని పెంచుతూ వెళుతున్న ఆ సినిమా పేరే 'అనోమి'. భావన ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. రియాస్ మారథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, థియేటర్స్  వైపు నుంచి యావరేజ్ టాక్ నే రాబట్టుకుంది. అయితే ఓటీటీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఒక రేంజ్ లో తన సత్తా చాటుకుంటోంది.

'జారా' ఫోరెన్సిక్ నిపుణురాలు. తన పనిలో ఆమె మంచి నైపుణ్యాన్ని కనబరుస్తూ ఉంటుంది. ఆధారాల సేకరణ విషయంలో ..రిపోర్ట్ విషయంలోను ఆమె చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అలాంటి ఆమె తమ్ముడు కనిపించకుండాపోతాడు. అందుకు కారణం ఎవరు? ఏమిటి?అనేది ఆమెకి అర్థం కాదు. అలాంటి పరిస్థితులలో ఆమె పోలీస్ ఆఫీసర్ మొహ్మద్ గిబ్రాన్ ను ఆమె సంప్రదిస్తుంది. రంగంలోకి దిగాడంటే ఆ కేసు అంతు చూడకుండా వదలడనే పేరు అతనికి ఉంటుంది. 

గిబ్రాన్ కి అప్పగించాం కదా అని 'జారా' చూస్తూ కూర్చోదు. తాను కూడా అన్వేషణ కొనసాగిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి ఎలాంటి భయంకరమైన నిజాలు తెలుస్తాయి? అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అనేదే కథ. క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగిపోయే ఈ సినిమాకి ఆడియన్స్ చాలా ఫాస్టుగా కనెక్ట్ అవుతున్నారు. ఆగస్టు 27వ తేదీ నుంచి ఈ సినిమా ' లైన్స్ గేట్ ప్లే'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లోను అందుబాటిలో ఉంది. త్వరలోను తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. 


Advertisement
Anomi
Bhavana
Malayalam psychological thriller
Anomi OTT release
Lionsgate Play
Amazon Prime Video

More Telugu News