లోన్ రికవరీ కోసం దారుణం.. మహిళను కిడ్నాప్ చేసి, నగ్నంగా వీడియో తీసిన గ్యాంగ్
- లోన్ రికవరీ కోసం మహిళను కిడ్నాప్ చేసి చిత్రహింసలు
- బలవంతంగా బట్టలు విప్పించి వీడియో తీసి బెదిరింపులు
- రూ.11 లక్షలు చెల్లించాలని బాధితురాలిపై దాడి
- రంగంలోకి దిగిన పోలీసులు.. నలుగురు నిందితుల అరెస్ట్
బెంగళూరులో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను కొందరు కిడ్నాప్ చేసి, రోజుల తరబడి నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. బలవంతంగా ఆమె దుస్తులు విప్పించి వీడియో తీసి, డబ్బు ఇవ్వకపోతే దాన్ని వైరల్ చేస్తామని బెదిరించారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
బెంగళూరు సుంకడకట్టే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ రెండేళ్ల క్రితం రేష్మా బాను వద్ద రూ. లక్ష, నజ్రత్ బేగం వద్ద రూ.50 వేలు వడ్డీకి అప్పుగా తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని నెలలుగా వాయిదాలు చెల్లించలేకపోయారు. దీంతో ఆగస్టు 27న పని ఇప్పిస్తానని చెప్పి నజ్రత్ ఆమెను తన ఇంటికి పిలిచింది. అక్కడికి వెళ్లగానే, రేష్మా, ఆమె భర్త సుహైల్, సైఫ్‌లు ఆమెపై దాడి చేసి, కత్తితో బెదిరించి కుంబల్‌గోడులోని రేష్మా ఇంటికి తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు.
అక్కడ ఆమెను నాలుగు రోజుల పాటు బంధించి, కర్రలతో కొట్టారు. అసలు, వడ్డీ కలిపి రూ.11 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 29న ఆమెను బలవంతంగా అర్ధనగ్నంగా మార్చి వీడియో తీశారు. డబ్బు చెల్లించకపోతే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని, వేశ్యావృత్తిలోకి దించుతామని బెదిరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా చంద్ర లేఅవుట్ పోలీసులు ఆగస్టు 31న రంగంలోకి దిగి, బాధితురాలిని రక్షించారు. ఈ ఘటనపై రేష్మా బాను, సుహైల్, నజ్రత్ బేగం, సైఫ్‌లపై కిడ్నాపింగ్, దాడి, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.