'బేబీ' జంట కొత్త సినిమా.. 'ఎపిక్'పై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
- 'బేబీ' హిట్ తర్వాత మళ్లీ వస్తున్న ఆనంద్, వైష్ణవి జంట
- 'ఎపిక్' చిత్రాన్ని 'ఐస్ లేని అర్జున్ రెడ్డి'తో పోల్చిన శివాజీ
- 13 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న నటుడు శివాజీ
- కథ, భావోద్వేగాలు చాలా సహజంగా ఉంటాయని వెల్లడి
- సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం
'బేబీ' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. వీరిద్దరి కలయికలో రూపొందిన తాజా చిత్రం 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న సీనియర్ నటుడు శివాజీ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ చిత్రంలో తాను ఒక కీలక పాత్ర పోషించినట్లు శివాజీ వెల్లడించారు. "దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చే క్రమంలో ఒక మంచి పాత్ర చేయాలని ఎదురుచూశాను. దర్శకుడు ఆదిత్య సృష్టించిన ఈ సినిమా ప్రపంచం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథ ఆద్యంతం ఎంతో భావోద్వేగభరితంగా సాగుతుంది" అని ఆయన వివరించారు. విదేశాల్లో ఉంటున్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఈ సినిమా ఒక పండుగలా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సినిమాలోని భావోద్వేగాలు, బ్రేకప్ సీన్లు అత్యంత సహజంగా ఉంటాయని చెబుతూ.. "ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది ఐస్ లేని 'అర్జున్ రెడ్డి' లాంటి సినిమా" అని శివాజీ పేర్కొన్నారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని, దీనికి కొనసాగింపుగా రానున్న 'చాప్టర్ 2' కూడా అద్భుతంగా ఉండబోతోందని ఆయన ప్రశంసించారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్' ఈ నెల 11న థియేటర్లలో విడుదల కానుంది.