భారత్‌లో పుట్టిన ఫేక్ న్యూస్‌ను నమ్మి.. ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన!
- నెతన్యాహు ప్రస్తావించిన ఇరాన్ అణుబాంబు వ్యాఖ్య ఫేక్
- భారత్‌కు చెందిన ఎక్స్ ఖాతాలో మొదలైన తప్పుడు పోస్టు
- ఇరాన్ కమాండర్ అలాంటి వ్యాఖ్య చేసినట్లు లేని ఆధారాలు
- తన ప్రసంగంలో ఆ సమాచారాన్ని ప్రస్తావించిన నెతన్యాహు
- ఫేక్ పోస్టును షేర్ చేసిన ఐరాస రాయబారి మైక్ వాల్జ్
ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన కీలక వ్యాఖ్యకు ఆధారమైన సమాచారం నకిలీదని తేలింది. సోషల్ మీడియాలో ఓ గుర్తుతెలియని ఖాతా పెట్టిన తప్పుడు పోస్టు గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్, అమెరికాకు చేరింది. చివరకు అదే సమాచారాన్ని నెతన్యాహు తన ప్రసంగంలో ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని ఐక్యరాజ్యసమితి రాయబారి మైక్ వాల్జ్ కూడా ఆ పోస్టును షేర్ చేశారు.
ఆగస్టు 5న భారత్‌కు చెందిన ఓ ఎక్స్ ఖాతా ఈ తప్పుడు ప్రచారానికి తెరతీసింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీది అణ్వాయుధాల తయారీని ఎప్పటికీ ఆపబోమని చెప్పినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. దానికి ఆయన ఫొటోతో పాటు అణు విస్ఫోటనాన్ని పోలిన ఏఐ చిత్రం జత చేశారు. అయితే వహీది అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎలాంటి ఆధారం లేదు. ఇరాన్ అణ్వాయుధం తయారు చేసిందన్న దానికి కూడా ఆధారాలు లేవు.
ఆ పోస్టు తొలుత భారత్‌లోనే మరో ఖాతాకు చేరింది. అక్కడి నుంచి హిందీలోకి అనువదించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్‌కు చెందిన ‘మొసాద్ కామెంటరీ’ పేరున్న ఖాతా దాన్ని మరింత ప్రచారం చేసింది. ఆ ఖాతాకు ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్‌తో సంబంధం ఉన్నట్లు ఎలాంటి నిర్ధారణ లేదు. కొద్దిసేపటికే ఇజ్రాయెల్ ఛానల్ 14 ఆ వ్యాఖ్యలను ప్రసారం చేసింది. ఆ తర్వాత నెతన్యాహు కుమారుడు యైర్ నెతన్యాహు కూడా పోస్టును షేర్ చేశారు.
కొన్ని గంటల్లోనే ఈ తప్పుడు సమాచారం ఇజ్రాయెల్ ప్రధాని ప్రసంగంలోకి చేరింది. జెరూసలెంలోని మౌంట్ హెర్జల్‌లో జరిగిన కార్యక్రమంలో నెతన్యాహు దాన్ని ఇరాన్ అణ్వాయుధాలపై సంకేతంగా ప్రస్తావించారు. అమెరికా రాయబారి వాల్ట్జ్ కూడా ఇరాన్ తన అణు ఉద్దేశాలను అంగీకరించిందంటూ పోస్టు చేశారు. అయితే తర్వాత ఆ పోస్టును ఎలాంటి వివరణ లేకుండా తొలగించారు.
ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఈ వైరల్ ప్రచారాన్ని ఖండించారు. ఇరాన్‌పై సాగుతున్న తప్పుడు ప్రచారంలో ఇదొక ఉదాహరణ అని చెప్పారు. ఈ ఘటన ఒక్క తప్పుడు పోస్టు ఎంత వేగంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించగలదో చూపించింది. నిజానిజాలు నిర్ధారించకముందే అది రాజకీయ చర్చలోకి వెళ్లడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.