Advertisement

జంతర్ మంతర్ వద్ద మళ్లీ ఉద్రిక్తత... పోలీసులపై రాళ్లు, సీసాలతో దాడి చేసిన ఆందోళనకారులు

Tension at Jantar Mantar again Protesters attack police with stones and bottles
  • సీజేపీ నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణ
  • పోలీసులపై రాళ్లు, సీసాలతో దాడి.. పలువురికి గాయాలు
  • ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు ప్రయోగం
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలకు నిరసనగా ఆందోళన చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు, వాటర్ బాటిళ్లతో దాడికి దిగడంతో పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన రాపిడ్ యాక్షన్ ఫోర్స్ నిరసనకారులపై భాష్పవాయు గోళాలను ప్రయోగించి వారిని చెదరగొట్టింది.

నీట్‌ పరీక్షలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిరసనకారులు పార్లమెంట్ వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ చెలరేగింది. అయితే, పోలీసులే ముందుగా తమపై భౌతిక దాడికి దిగారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.

పోలీసు వర్గాల కథనం ప్రకారం, "జంతర్ మంతర్ వద్ద గుమిగూడిన నిరసనకారులు టాల్‌స్టాయ్ మార్గ్ వైపు కదలడంతో ప్రదర్శన హింసాత్మకంగా మారింది. అక్కడ మోహరించిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు, సీసాలతో దాడులకు పాల్పడ్డారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆర్ఏఎఫ్, ఢిల్లీ పోలీసు బృందాలు అక్కడ విధుల్లో ఉండగా, నిరసనకారులు అకస్మాత్తుగా దాడికి దిగారు" అని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Advertisement
Cockroach Janata Party
Jantar Mantar Protest
NEET Exam Controversy
Delhi Police Clash
Dharmendra Pradhan Resignation

More Telugu News