Advertisement

వందే భారత్‌ స్లీపర్‌పై విదేశీ మహిళ ప్రశంసలు.. ఆరు నెలల తర్వాతా అదే పరిశుభ్రత!

Foreign woman praises Vande Bharat Sleeper same cleanliness after six months
  • విదేశీ ట్రావెల్‌ బ్లాగర్‌ వందే భారత్‌ స్లీపర్‌పై ప్రశంసలు
  • ఆరు నెలల తర్వాత కూడా పరిశుభ్రత చూసి ఆశ్చర్యం
  • ఫస్ట్‌ ఏసీ కేబిన్‌ విశాలంగా, ఆధునికంగా ఉందని వ్యాఖ్య
  • బాత్‌రూమ్‌, షవర్‌ ఏరియా కూడా శుభ్రంగా ఉన్నాయని వెల్లడి
  • ప్రారంభంలో ఇచ్చినట్లే భోజనం నాణ్యత ఉందని వెల్లడి
వందే భారత్‌ స్లీపర్‌ రైలు సేవలపై ఓ విదేశీ ట్రావెల్‌ బ్లాగర్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన కామాఖ్య-హౌరా వందే భారత్‌ స్లీపర్‌ రైలులో తొలి ప్రయాణం చేసిన అదే బ్లాగర్‌.. ఆరు నెలల తర్వాత మరోసారి ప్రయాణించి తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. రైలు పరిశుభ్రత, సేవలు చూసి తాను ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు.

మొదటిసారి ప్రారంభించిన రోజు మాత్రమే శుభ్రంగా ఉంచి ఉంటారని భావించానని, కానీ ఆరు నెలల తర్వాత కూడా రైలు ఎంతో పరిశుభ్రంగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. ఈసారి గువాహటి నుంచి కోల్‌కతా వరకు ఫస్ట్‌ ఏసీలో ఒంటరిగా ప్రయాణించినట్లు చెప్పారు.

ఫస్ట్‌ ఏసీ కేబిన్‌ విశాలంగా, ఆధునికంగా ఉందని, ముఖ్యంగా బాత్‌రూమ్‌, షవర్‌ ఏరియా కూడా చాలా శుభ్రంగా ఉండటం తనను ఆకట్టుకుందని వివరించారు. అలాగే ప్రారంభం రోజున ఎలా నాణ్యమైన ఆహారం అందించారో, ఇప్పుడు కూడా అదే స్థాయి భోజనం అందించారని ప్రశంసించారు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారగా, పలువురు నెటిజన్లు భారతీయ రైల్వే సేవలను అభినందించారు. రైల్వేలు తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని, ప్రయాణికులు కూడా ఈ సౌకర్యాలను కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించారు.
Advertisement
Vande Bharat Sleeper
Indian Railways
Foreign Travel Blogger
Kamakhya Howrah Vande Bharat
Guwahati to Kolkata Train
Vande Bharat Cleanliness

More Telugu News