ఎల్లుండి తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపు
- విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపు
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్
- ఎన్‌టీఏను రద్దు చేయాలని పట్టు
- వీవీబీఎస్‌ఏ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- ఢిల్లీ పోలీసుల చర్యలపై విచారణకు డిమాండ్
దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, అవకతవకలకు నిరసనగా జులై 24న తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్, ఏఐఎస్‌బీ, ఏఐపీఎస్‌యూ సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నాయి.
హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు బంద్ వివరాలను వెల్లడించారు. వరుస పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశ విద్యా వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ని రద్దు చేయాలని, విద్యా వ్యవస్థ స్వయంప్రతిపత్తికి భంగం కలిగిస్తోందని ఆరోపిస్తున్న వీవీబీఎస్‌ఏ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసుల దాడిపై పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
జులై 24న జరిగే విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు, తల్లిదండ్రులు, మేధావులు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది.