శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ల సందడి.. ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా, ఫ్లిప్ 8 ఆవిష్కరణ
- నేటి రాత్రి నుంచే ప్రీ-ఆర్డర్లు ప్రారంభం
- ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9 సపోర్ట్
- ఏడేళ్ల ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్ల హామీ
- ఫోల్డ్ 8 ధర రూ.1.79 లక్షల నుంచి
- ఫ్లిప్ 8 ధర రూ.1.24 లక్షల నుంచి
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘శాంసంగ్ అన్‌ప్యాక్డ్’ ఈవెంట్‌లో గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8 అల్ట్రా, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 8లను అధికారికంగా విడుదల చేసింది. వీటితో పాటు గెలాక్సీ వాచ్ అల్ట్రా, గెలాక్సీ వాచ్ 9లను కూడా ఆవిష్కరించింది. కొత్త ఫోన్లకు నేటి రాత్రి నుంచే ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.
ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9పై పనిచేస్తాయి. వీటికి ఏడేళ్ల ఓఎస్ అప్‌డేట్లు, ఏడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని శాంసంగ్ ప్రకటించింది.
గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8
ఈ ఫోన్‌లో 7.6 అంగుళాల QXGA+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ మెయిన్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వెనుక భాగంలో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 50 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, ముందు రెండు 10 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.
ధరలు:
గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8 అల్ట్రా
8 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 6.5 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో ఈ మోడల్ వస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, IP48 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయి. 200 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 50 ఎంపీ అల్ట్రావైడ్, 10 ఎంపీ టెలిఫొటో కెమెరా అందించారు.
ధరలు:
గెలాక్సీ జడ్ ఫ్లిప్ 8
ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 4.1 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్, 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కల్పించారు. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 10 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి.

- 12జీబీ + 256జీబీ - రూ.1,79,999
- 12జీబీ + 512జీబీ - రూ.1,99,999
- 16జీబీ + 1టీబీ - రూ.2,39,999
గెలాక్సీ జడ్ ఫోల్డ్ 8 అల్ట్రా
8 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 6.5 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో ఈ మోడల్ వస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, IP48 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉన్నాయి. 200 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 50 ఎంపీ అల్ట్రావైడ్, 10 ఎంపీ టెలిఫొటో కెమెరా అందించారు.
ధరలు:
- 12జీబీ + 256జీబీ - రూ.1,99,999
- 12జీబీ + 512జీబీ - రూ.2,19,999
- 16జీబీ + 1TB - రూ.2,59,999
గెలాక్సీ జడ్ ఫ్లిప్ 8
ఈ ఫోన్‌లో 6.9 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 4.1 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. ఎగ్జినోస్ 2600 ప్రాసెసర్, 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కల్పించారు. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 10 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇందులో ఉన్నాయి.
ధరలు:
- 12జీబీ + 256జీబీ - రూ.1,24,999
- 12జీబీ + 512జీబీ - రూ.1,44,999