మా అమ్మ అలా చనిపోయిందని అంటారు: రవిబాబు
- నటుడిగా, దర్శకుడిగా రవిబాబుకి పేరు
- కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే రవిబాబు
- తల్లి మరణం గురించిన ప్రస్తావన
- తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోలేదని వ్యాఖ్య
"మా అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని .. నాకు ఏమీ తెలియదు. ఈ విషయాన్ని గురించి ఆ తరువాత నేను నాన్నను ఎప్పుడూ అడగలేదు .. ఆయన చెప్పలేదు. కానీ కొంతమంది చెప్పినదానిని బట్టి, మా అమ్మ ఎలా చనిపోయిందనే విషయంలో నాకు ఒక క్లారిటీ వచ్చింది. అనుకోకుండా జరిగిన ప్రమాదం కారణంగా ఆమె చనిపోయింది. తెల్లవారు జామున 'టి' పెడుతూ ఉండగా, ఆమె చీరకి నిప్పు అంటుకుంది" అని అన్నారు.
' మా అమ్మకి చీరకి నిప్పు అంటుకుని కాలిపోతుండగా, ఆ కంగారులో మా ఫాదర్ ఆమెపై నీళ్లు పోశారు. అలా పోయకూడదని ఆయనకి తెలియదు. ఏ దుప్పటో చుట్టేసి మంటలు ఆర్పడానికి ట్రై చేయాల్సింది. హాస్పిటల్లో 3 రోజుల పాటు ఉన్న తరువాత అమ్మ చనిపోయింది. అప్పటికి నాన్న వయసు 30 లోపే. మళ్లీ పెళ్లి చేసుకోమని చాలామంది సలహా ఇచ్చినప్పటికీ ఆయన వినిపించుకోలేదు' అని అన్నారు.