నాటో దేశాల తీరుపై ట్రంప్ మరోసారి విసుర్లు
- కాల్పుల విరమణపై అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు రంగం సిద్ధం
- పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగనున్న కీలక భేటీ
- ఇజ్రాయెల్ దాడులతో చర్చలకు అర్థం లేదన్న ఇరాన్ అధ్యక్షుడు
- మిత్రదేశాలైన నాటోపై మరోసారి విరుచుకుపడిన డొనాల్డ్ ట్రంప్
అయితే, ఈ చర్చలకు ముందే ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఇలాంటి పరిస్థితుల్లో చర్చలు జరపడం అర్థరహితమని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నాటో మిత్రదేశాలపై మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. "ఒత్తిడి చేస్తే తప్ప మనల్ని నిరాశపరిచే నాటో సహా మిత్ర దేశాలకు ఏమీ అర్థం కాదు" అని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. గతంలో ఇరాన్‌పై చర్యలు, హర్మూజ్ జలసంధి వద్ద భద్రత విషయంలో నాటో దేశాలు సహకరించలేదని ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.